అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మరణంలోనూ స్టీరింగ్ వదలని పైలట్!
- అహ్మదాబాద్ విమాన ప్రమాద మార్చురీలో భయానక దృశ్యాలు
- మరణంలోనూ స్టీరింగ్ వదలని పైలట్ సుమీత్
- విమానాన్ని కాపాడేందుకు చివరిదాకా ప్రయత్నం
- పైలట్ తప్పిదమేనంటూ రిపోర్టులు
- కోర్టులో సవాల్ చేసిన కుటుంబ సభ్యులు
ఎయిరిండియా ఏఐ-171 విమాన ప్రమాద బాధితులను ఉంచిన మార్చురీకి వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ చూసిన భయానక దృశ్యాలను తాజాగా వివరించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విమాన కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతదేహం.. అప్పటికీ విమాన స్టీరింగ్ కాలమ్‌ను గట్టిగా పట్టుకొనే ఉందని ఆయన వెల్లడించారు. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌లోని మార్చురీలో తను చూసిన ఈ దృశ్యాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని సదరు వ్యక్తి వాపోయారు.
లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం గతేడాది కుప్పకూలి అహ్మదాబాద్‌లోని విజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 260 మంది మృతి చెందారు. వీళ్లలో తన బంధువుల మృతదేహాలను గుర్తించడానికి మార్చురీలోకి వెళ్లినట్లు రోమిన్ వోహ్రా అనే వ్యక్తి వెల్లడించారు. అక్కడ నేలపై వరుసగా పడేసిన మృతదేహాలు, కాళ్లు, చేతులు తెగిపడిన దృశ్యాలు నరకాన్ని తలపించాయని గుర్తుచేసుకున్నారు.
అయితే మార్చురీలో ఒక మూల పైలట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతదేహాన్ని ప్రత్యేకంగా ఉంచారని రోమిన్ తెలిపారు. ఆయన మృతదేహం అప్పటికీ కూర్చున్న పొజిషన్లోనే ఉందని, వెనుక భాగం కాలినా ముందు భాగం బాగానే ఉందని చెప్పారు. ఆయన యూనిఫామ్, షూ అలాగే ఉన్నాయని.. చేతులు విమాన స్టీరింగ్ కాలమ్(యోక్)ను గట్టిగా పట్టుకునే ఉన్నాయని వివరించారు. పైలట్ చివరి క్షణం వరకు విమానాన్ని కాపాడటానికి ప్రయత్నించారనే వాదనకు ఈ దృశ్యం బలాన్ని ఇస్తోందని నిపుణులు అంటున్నారు. విమాన ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దీంట్లో పైలట్ల తప్పిదం ఉందనే కోణంలో దర్యాప్తు జరుగుతుండగా.. పైలట్ కుటుంబ సభ్యులు మాత్రం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు.